24 గంటల్లో 77,266 కేసులు…
భారత్తో కరోనా విజృంభణ రోజురోజుకీ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. గత 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా కొత్తగా 77,266 కేసులు నమోదయ్యాయి. ప్రపంచంలో ఒక్కరోజు వ్యవధిలో అత్యధికంగా 75,760 కేసులు బుధవారం, గురువారం మధ్య భారత్లోనే నమోదయ్యాయి. ఈరోజు అంతకంటే ఎక్కువ కేసులు వెలుగు చూడడం ఆందోళన కలిగిస్తోంది. ఇక కొత్తగా 1,075 మంది మరణించడంతో దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు మరణాల సంఖ్య 61,529కి చేరింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 33,87,501కి పెరిగింది. వీరిలో 25,83,948 మంది కోలుకొని ఇళ్లకు చేరగా, 7,42,023 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గురువారం ఒక్కరోజే 9,01,338 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. కొత్తగా 60,177 మంది కోలుకున్నారు. దీంతో కరోనా బారిన పడ్డవారిలో 76.28 శాతం కోలుకున్నట్లుయింది.






