తెలంగాణలో రికార్డు స్థాయిలో..3వేల కేసులు..
ఇప్పటిదాకా రోజుకి వెయ్యి, రెండువేల కేసుల నమోదుకే పరిమితమైన తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి 3వేలు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 3018 కొరొనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు అధికారులు విడుదల చేసిన బులెటిన్‌లో తెలిపారు.
దీంతో కలిపి మొత్తం ఇప్పటి రాష్ట్రంలో 1 11 688 కొరొనా కేసులు నమోదయ్యాయని, గడచిన 24గంటల్లో సంభవించిన 10 మరణాలతో కలిపి మరణాల సంఖ్య 788 కి చేరిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రం మొత్తం మీద యాక్టీవ్ కేసులు 25 685గా ఉందని వివరించారు. గడిచిన 24 గంటల్లో 29 146 శాంపిల్స్ కలెక్ట్ చేయగా ఫలితాలు వచ్చినవి కాక ఇంకా 1176 పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. సర్కిళ్ల వారీగా చూస్తే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 475, కరీంనగర్లో 127, ఖమ్మంలో 161, మంచిర్యాలలో 103, మేడ్చెల్ లో 204, నల్గొండలో 190, నిజామాబాద్ లో 136, రంగారెడ్డి లో 247, వరంగల్ అర్బన్‌లో 139 కేసులు నమోదు అయ్యాయని, ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లో 19 113 మంది ఉన్నట్లు వైద్యశాఖ అధికారులు వెల్లడించారు.






