24 గంటల్లో లో 2,795 కేసులు, 8 మరణాలు
తెలంగాణలో కరోనా వ్యాప్తి ఉధృతంగానే ఉంది. తాజా హెల్త్ బులెటిన్ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 2795 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,14,483కి చేరింది. ఇందులో 86,095 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 27,600 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 8 మంది మృతి చెందగా మొత్తం కరోనా మరణాల సంఖ్య 778కి చేరింది. ఇక కేసుల విషయానికి వస్తే జీహెచ్ఎంసీ పరిధిలో 449, భదాద్రి కొత్త గూడెంలో 72, జగిత్యాలలో 89, కరీంనగర్లో 136, ఖమ్మంలో 152, మంచిర్యాలలో 106, మహబూబాబాద్ జిల్లాలో 102, నల్గొండలో 164, నిజామాబాద్‌లో 112, పెద్దపల్లిలో 77, రంగారెడ్డి జిల్లాలో 268, సిద్ధిపేట జిల్లాలో 113, సూర్యాపేటలో 86, వరంగల్ అర్బన్‌లో 132 కేసులు నమోదయ్యాయి.






