తెలంగాణలో 2,579 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,579 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. కేవలం హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే 295 నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,08,670 పాజిటివ్ కేసులు నిర్ధారన కాగా, వైరస్ ప్రభావంతో ఇవాళ 9 మంది మృతి చెందగా, మొత్తం మరణించిన వారి సంఖ్య 770కి చేరింది. ఇవాళ 1,752 మంది వైరస్ బారినుంచి కోలుకొని ఇళ్లకు వెళ్లగా, మొత్తం 84,163 మంది డిశ్చార్జి అయ్యారు. మరో వైపు 23,737 మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. ఇంట్లో ఐసోలేషన్ కేంద్రాల్లో 17,226 మంది ఉన్నారు. గడిచిన 24 గంటల వ్యవధిలో 52,933 మందికి కొవిడ్- 19 పరీక్షలు చేయగా, ఇప్పటివరకు 10,21,054 మందికి టెస్టులు చేసినట్లు పేర్కొంది.






