తెలంగాణలో 2,478 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 2,478 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,35,884కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 10 మందిమృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 886కి చేరింది. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 267 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. తాజాగా 2,011 మంది మహమ్మారి నుంచి కోలుకోగా, ఇప్పటి వరకు 1,02,024 మంది కరోనాను జయించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 32,994 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరో 25,730 మంది హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు.






