తెలంగాణలో కొత్తగా 2,426 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 2426 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,52,602కు చేరాయి. అదేవిధంగా కరోనా నుంచి నిన్న మరో 2324 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు మొత్తం 1,19,467 మంది బాధితులు కరోనా నుంచి కోలుకుని ఇంటికి చేరారు. మరో 32,195 మంది చికిత్స పొందుతున్నారు. ఇందులో 25,240 మంది హోం ఐసోలేషన్లో ఉన్నారు. కాగా, నిన్న మరో 13 మంది కరోనాతో మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా మృతులు 940కి పెరిగారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 78.2 శాతం ఉండగా, కరోనా మరణాల రేటు 0.61 శాతంగా ఉన్నదని వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. నిన్న ఒకేరోజు 62,890 మంది కరోనా పరీక్షలు నిర్వహించామని వెల్లడించింది. ఇప్పటి వరకు తెలంగాణలో నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 20,16,461కి చేరింది.






