తెలంగాణలో కొత్తగా 2,058 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 2,058 కొత్త కేసులు నమోదైనట్లు వ్యైద్యారోగ్యశాఖ తెలిపింది. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,60,571కి చేరింది. ఇందులో 1,29,187 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 30,400 యాక్టివ్ కేసులు ఉన్నాయని, వారిలో 23,534 మంది హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. గత 24 గంటల్లో కరోనాతో 10 మంది మృతిచెందగా, మొత్తం మరణించిన వారి సంఖ్య 984 కి చేరింది. కేసులు వారిగా చూస్తే.. జీహెచ్ఎంసీ 277, కరీంనగర్ 135, ఖమ్మం 103, రంగారెడ్డి 143, సిద్ధిపేట 106, వరంగల్ అర్బన్ లో 108 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో కరోనా రికవరీ రేటు 80.45 శాతంగా ఉంది. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సం•్య 22,20,586కి చేరింది.






