తెలంగాణలో కొత్తగా 1967 పాజిటివ్ కేసులు
తెలంగాణ రాష్ట్రంలో 1,967 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 99,391కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 8 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 737కి చేరింది. కరోనా నుంచి నిన్న 1,781 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 76,976కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు సంఖ్య 21,687గా ఉందని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. తెలంగాణలో ఇప్పటి వరకు చేసిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 8,48,078కి చేరింది.






