ఏపీలో కొత్తగా 10,825 పాజిటివ్ కేసులు..
కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఆంధప్రదేశ్ రాష్ట్రం దూకుడు కొనసాగిస్తోంది. ఇప్పటివరకూ రాష్ట్రంలో 40,35,317 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేశారు. శనివారం ఒక్కరోజే 69,623 మందికి పరీక్షలు చేశారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో వివిధ ఆస్పత్రుల నుంచి ఒకేరోజు 11,941 మంది డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో రికవరీ రేటు రోజు రోజుకూ పెరుగుతున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. శనివారం ఉదయం 10 గంటల వరకు (24 గంటల్లో) 10,825 పాజిటివ్ కేసులు నమోదు కాగా 71 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 4,87,331 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3,82,104 మంది చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య 4,374కు చేరుకుంది. రాష్ట్రంలో మిలియన్ జనాభాకు 75,568 టెస్టులు చేస్తున్నారు. జనాభా ప్రతిపదికన దేశంలో ఇదే అత్యధికమని ఐసీఎంఆర్ గణాంకాలు వెల్లడించాయి.






