ఏపీలో 10,603 కరోనా కేసులు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఆదివారం వెల్లడించిన గణాంకాల ప్రకారం రికవరీ రేటు 75.75 శాతానికి చేరింది. గడిచిన 24 గంటల్లో 9,067 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఆదివారం ఒక్క రోజులో 63,077 టెస్టులు నిర్వహించారు. గడచిన 24 గంటల్లో 10,603 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా, 88 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 36,66,422 టెస్టులు చేయగా 4,24,767 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 3,21,754 మంది కోలుకోగా, 99,129 మంది చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య 3,884కు చేరింది. రాష్ట్రంలో మిలియన్ జనాభాకు 68,660 టెస్టులు చేస్తున్నారు. ఇది దేశంలోనే అత్యధికం అని ఐసీఎంఆర్ గణాంకాలు వెల్లడించాయి. 62,394 టెస్టులు చేస్తూ అస్సాం రెండో స్థానంలో ఉంది.






