ఆంధప్రదేశ్‌లో కరోనా ఉధృతి ….
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కల్లోలం ఇంకా కొనసాగుతోంది. రోజురోజుకు కరోనా ఉధృతి కొనసాగుతోంది. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు రాష్ట్రంలో కొత్తగా 10,418 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 74 మంది మృతి చెందారు. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి రాష్ట్రంలో 5,27,512కి కరోనా కేసులు చేరాయి. ఇప్పటివరకు కరోనాతో 4,634 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 97,271 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని 4,25,607 మంది రికవరీ అయ్యారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 43.08 లక్షల కరోనా టెస్టుల చేశారు.
కొత్తగా కడప 9, నెల్లూరు, ప్రకాశం, విశాఖలో ఏడుగురు చొప్పున కరోనాతో మృతి చెందారు. అనంతపురం, చిత్తూరు, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఆరుగురు చొప్పున మృతి చెందారు. కృష్ణా, కర్నూలు, శ్రీకాకుళం, జిల్లాల్లో ఐదుగురు చొప్పున మృతి చెందారు. విజయనగరం 3, తూర్పుగోదావరి జిల్లాలో ఇద్దరు మృతి చెందారు. కొత్తగా తూర్పుగోదావరి జిల్లాలో 1,399, ప్రకాశం 1,271, పశ్చిమగోదావరి జిల్లాల్లో 1,134 కరోనా కేసులు నమోదయ్యాయి.






