ఏపీలో కొత్తగా 10,392 కరోనా కేసులు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 60,804 నమూనాలను పరీక్షించగా 10,392 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. తాజా కేసులతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 4,55,531కి చేరింది. ఈ మేరకు వైద్యఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. ఒక్క రోజు వ్యవధిలో 72 మంది కరోనాతో మృతి చెందారు. నెల్లూరు జిల్లాలో 11 మంది, చిత్తూరు 10, పశ్చిమగోదావరి 9, ప్రకాశం 8, కృష్ణా 6, విశాఖపట్నం 6, అనంతపురం 4, తూర్పుగోదావరి 4, గుంటూరు 4, శ్రీకాకుళం 4, విజయనగరం 3, కడప 2, కర్నూలు జిల్లాలో ఒకరు మరణించారు. తాజా లెక్కలతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 4,125కి చేరింది. 24 గంటల్లో 8,454 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 38,43,550 నమూనాలను పరీక్షించారు. ప్రస్తుతం 1,03,076 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ప్రభుత్వ బులెటిన్లో పేర్కొంది.






