ఏపీలో కొనసాగుతున్న కరోనా ఉధృతి
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 10,175 కరోనా కేసులు నమోదైయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 68 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా కేసులు 5,37,687కి చేరగా, మరణాల సంఖ్య 4,702కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 97,338 యాక్టివ్ కేసులు ఉండగా, 4,35,647 మంది రికవరీ అయ్యారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 43.80 లక్షల కరోనా టెస్టులు నిర్వహించారు. కొత్తగా చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో 9 మంది చొప్పున మృతి చెందగా కృష్ణా 7, ప్రకాశం 7, అనంతపురం 6, తూర్పు గోదావరి 5, పశ్చిమ గోదావరి 5, శ్రీకాకుళం 4, విశాఖపట్నం 4, గుంటూరు 2, విజయనగరంలో ఒకరు మరణించినట్లు బులెటిన్లో పేర్కొన్నారు.






