లాస్ ఏంజెల్స్ లో వైఎస్సార్సీపీ విజయోత్సవం
ఇటీవలి శాసనసభ ఎన్నికలో వైఎస్సార్సీపీ ఘనవిజయం సాధించడంపై లాస్ ఏంజెల్స్‌లో నివసిస్తున్న ప్రవాసాంధ్రులు విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. ఇర్విన్ పట్టణంలోని శ్రీ శివ కామేశ్వరి దేవస్థానం నుండి కారు ర్యాలీ చేపట్టారు. అనంతరం ప్రవాసాంధ్రులు సమావేశమై 9సంవత్సరాల నిరీక్షణ ఫలించిందని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. సూర్య గంగిరెడ్డి, రామ కష్ణారెడ్డి భూమా, భాస్కర్ అళ్లూరు, శ్రీనివాస్ రెడ్డి పడిగెపాటి, బయపారెడ్డి దాడెం, ప్రవీళ్ ఆళ్లల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ర్యాలీలో పాల్గొన్న వైఎస్సార్సీపీ అభిమానులకు సూర్య గంగిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు.













