మళ్లీ సోకదని కచ్చితంగా చెప్పలేం
కరోనా చికిత్స పొంది కోలుకున్న వారికి తిరిగి ఆ వైరస్ సోకదని కచ్చితంగా చెప్పలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తెలిపింది. వారిలో తయారయ్యే ప్రతిరక్షకాలు వైరస్ నుంచి కల్పిస్తాయని ఇప్పటికైతే ఎటు వంటి ఆధారాలు లేవని పేర్కొన్నది. కోలుకున్న వారిలో వైరస్ నిరోధక యాంటీబాడీస్ ఉంటాయని భావించరాదని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. కరోనా వైరస్, దీని నివారణ, చికిత్స వంటి పలు అంశాలపై మరింతగా అధ్యయనాలు, పరిశోధనలు జరగాల్సి ఉందన్నారు. యాంటీబాడీస్‌తో వెనువెంటనే రోగనిరోధక శక్తి పెరిగి, ఇకపై కరోనాకు గురి కాకుండా ఉండగల్గుతారని చెప్పడానికి శాస్త్రీయ ఆధారాలు ఏమీ లేవని ప్రకటనలో సృష్టం చేశారు.













