వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా కు అరుదైన గౌరవం
గ్రేట్ ఇమ్మిగ్రెంట్స్ 2023 జాబితాలో ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగాకు చోటు దక్కింది. న్యూయార్క్‌లోని కార్నెగీ కార్పొరేషన్‌లోని దాతృత్వ సంస్థ ఈ జాబితాను తయారు చేస్తుంది. అజయ్ బంగాతో పాటు, ప్రసిద్ధ నటుడు డ్రామా సిరిస్ ది లాస్ట్ ఆఫ్ అస్ స్టార్, పెడ్రో పాస్కలకు ఈ అరుదైన గౌరవం దక్కింది. అలాగే వియత్నాంలో జన్మించిన నటుడు కె హుయ్ క్వాన్ కూడా ఎవరీథింగ్ ఎవ్రీవేర్లో ఉత్తమ సహాయ నటుడిగా ఈ సంవత్సరం ఆస్కార్‌ను గెలుచుకున్నారు. అజయ్ బంగా జూన్ 2023లో, ప్రపంచ బ్యాంకుకు నాయకత్వం వహించిన మొదటి భారతీయ అమెరికన్ అయ్యాడు. ఈ ఏడాది జాబితాలో ఉన్న ఏకైక భారతీయుడిగాను ఆయన ప్రత్యేక గుర్తింపు పొందాడు.













