ప్రవాస భారతీయుల ఇళ్లే ఆమె టార్గెట్
ఆమె పేరు చాకా కాస్ట్రో (44). అమెరికాలో ఓ దొంగల ముఠాకు ఆమె చీఫ్. టెక్సాస్‌లో ప్రవాస భారతీయుల ఇళ్లలోకి ప్రవేశించి దోచుకోవడమే ఆమె లక్ష్యం. ఇందు కోసం తన ముఠా సభ్యులను పంపి ముందుగా రెక్కీ నిర్వహిస్తుంది. అనంతరం స్కెచ్ వేసి, పక్కా ప్రణాళిక ప్రకారం దోచుకుంటోంది. ఈ క్రమంలో ఆమె చివరకు పోలీసులకు చిక్కింది. తాజాగా, చాకా కాస్ట్రోకు అమెరికాలో ఒక న్యాయస్థానం ఏకంగా 37 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. కాస్ట్రో సూచనల మేరకు ఆమె ముఠా సభ్యులు ప్రవాస భారతీయుల ఇళ్లకు వెళ్లి చోరీలు చేసేవారని న్యాయస్థానంలో తేలడంతో ఈ శిక్ష పడింది.













