మెదడుకు ఆపరేషన్ చేస్తుంటే… వేణుగానం ఆలపించిన బామ్మ
వైద్యులు మెదడుకు క్లిష్టమైన ఆపరేషన్ చేస్తుంటే, అదేమీ పట్టనట్లు వేణువుతో రాగాలు తీసిందో మహిళ. పైగా తనకున్న వ్యాధిని తగ్గించేసుకుంది కూడా. అమెరికాకు చెందిన అన్నా హెన్రీ(63) గొప్ప పిల్లనగ్రోవి వాయిద్యకారిణి. అయితే, వేణువు వాయిస్తుంటే ఆమె చేతి వేళ్లు వణికి పోయాయి. ఏమైందోనని ఆస్పత్రికి వెళ్తే మెదడులో కణితి పెరిగిందని, దాన్ని తొలగించాలని చెప్పారు. ఆమె మెదడును పరిశీలించిన టెక్సస్ మెడికల్ సెంటర్ వైద్యులు, వేణువు వాయిస్తుంటే కణితిని తొలగించడం సులువవుతుదని నిర్థారణకు వచ్చారు. ఓ వైపు ఆమె వేణువుతో రాగాలు తీస్తుంటే కణితి తొలగించి, చేతి వేళ్ల వణకుడు నుంచి విముక్తి ప్రసాదించారు.













