ప్రధాని మోదీని ప్రశ్నించిన .. అమెరికా జర్నలిస్టుకు
ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన వెళ్లిన విషయం తెలిసిందే. అధ్యక్షుడు జో బైడెన్‌తో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మోదీ పాల్గొన్నారు. అయితే వాల్ స్ట్రీట్ జర్నల్‌కు చెందిన రిపోర్టర్ సబ్రినా సిద్దిక్ భారత్‌లో ఉన్న ప్రజాస్వామ్యంపై మోదీని ప్రశ్నించారు. మోదీని క్వశ్చన్ చేసినందుకు రిపోర్టర్ సబ్రినాపై ఆన్లైన్లో వేధింపులు మొదలయ్యాయి. ఆ వేధింపులు చాలా తీవ్రంగా ఉన్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ ఆరోపించింది. సబ్రినాకు జరుగుతున్న వేధింపుల గురించి తమకు తెలుసు అని, ఆ వేధింపులను ఖండిస్తున్నట్లు వైట్‌హౌస్ ప్రతినిధి జాన్ కిర్బీ తెలిపారు. ఆ రిపోర్టర్ ముస్లిం మతస్థురాలు అని, ఆన్లైన్లో ఆమెపై సాగుతున్న వేధింపుల గురించి తమకు తెలుసు అని జాన్ వెల్లడిరచారు.













