సింగపూర్ ఎక్కడ ఉంది..?
ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూసిన ట్రంప్-కిమ్‌ల భేటీ సింగపూర్‌లో నేడు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరు అధ్యక్షుల భేటీ నేపథ్యంలో అమెరికాలో ప్రజలు గూగుల్‌లో ఎక్కవగా సర్చ్ చేసింది దేని గురించో తెలుసా. వేర్ ఇజ్ సింగపూర్ ఇన్ ది వరల్డ్? (ప్రపంచంలో సింగపూర్ ఎక్కడుంది?) వీరిద్దరి భేటీ గురించి ప్రకటించిన తర్వాత చాలా మంది అమెరికన్స్ సింగపూర్ గురించే ఎక్కువగా సర్చ్ చేశారంట. దాంతో పాటు ఉత్తర కొరియా ఎక్కడుంది? సింగపూర్ చైనా లేదా జపాన్‌లో భాగమా? లేదా సింగపూర్ స్వయంగా ఒక దేశమా? వంటి పలు ఆసక్తికర అంశాల గురించి సర్చ్ చేసారంట. కేవలం సింగపూర్ గురించే కాక మరికొందరు కిమ్ గురించి కూడా సర్చ్ చేసాంట. కిమ్ ఎత్తు ఎంత? కిమ్ ఇంగ్లీష్ మాట్లడగలడా? అంటూ సర్చ్ చేసారు.













