WATS: వాట్స్ సంక్రాంతి, రిపబ్లిక్ డే వేడుకలు
వాషింగ్టన్ తెలుగు సమితి(WATS) సంక్రాంతి వేడుకలు, రిపబ్లిక్ డే(Republic Day) వేడుకలు ఇటీవల వైభవంగా జరిగాయి. జనవరి 26వ తేదీన జునైతా హైస్కూల్లో వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు, ముగ్గుల పోటీలు తదితర కార్యక్రమాలు జరిగాయి. స్టైల్ బీట్స్ డ్యాన్స్ అకాడమీ, విలాసినీ ఆర్ట్స్, నాట్య ప్రియ స్కూల్ ఆఫ్ డ్యాన్స్, నటరాజ డ్యాన్స్ అకాడమీ, నృత్యాంజలి చిన్నారుల డ్యాన్స్‌లు, శ్రీ అభిహత గ్రూపు చిన్నారుల నృత్యాలు అందరినీ అలరించాయి. ఈ వేడుకలను పురస్కరించుకుని అధ్యక్షుడు రాజేష్ గూడవల్లి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. వైస్ ప్రెసిడెంట్ మధు రెడ్డి, కార్యదర్శి ప్రకాశ్ కొండూరు, ట్రెజరర్ రామ్ తమ్మినేని, కల్చరల్ సెక్రటరీ హరిణి దేశరాజు, లిటరరీ సెక్రటరీ శివ వెదురుపర్తి, వెబ్ మాస్టర్ శ్రీరామ్ పాటిబండ్ల తదితరులు ఈ వేడుకల విజయవంతానికి కృషి చేశారు.







