రెండు దేశాల సంబంధాలు బలోపేతం : వైట్‌హౌస్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనతో భారత్, అమెరికా మధ్య వ్యూహాత్మక సంబంధాలు మరింత బలోపేతమవుతాయని వైట్‌హౌస్ అభిప్రాయపడింది. బలమైన ఆర్థిక బంధంతో పెట్టుబడులు, ఉద్యోగ కల్పనలో రెండు దేశాలు లబ్ధి పొందుతాయని వైట్‌హౌస్ ఓ ప్రకటనలో పేర్కొంది. రెండు దేశాల మధ్య 2018 లోనే 142 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరిగిందని తెలిపింది. భారత్‌లో సహజ వాయువు సరఫరాలో సహకరించే ఒప్పందంపై ఎక్కాన్ బోమిల్ సంతకం చేసిందని గుర్తు చేసింది. దీంతో అమెరికా నుంచి సహజ వాయువు ఎగుమతి మరింత పెరుగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేసింది. డొనాల్డ్ ట్రంప్ దంపతులకు అండగా నిలిచిన భారతీయులకు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) రాబర్ట్ ఓ బ్రీన్ కృతజ్ఞతలు తెలిపారు. అమెరికా, వైట్‌హౌస్‌లో భారతీయలకు మిత్రులు ఉన్నారని చెప్పారు. భారత్‌లో ట్రంప్ వెంట రాబర్ట్ చర్చల సందర్భంగా భారత్‌లో మతస్వేచ్ఛ, మైనారిటీల దుస్థితిని ప్రస్తావించిన ట్రంప్‌కు ఇండో-అమెరికన్ క్రైస్తవులు కృతజ్ఞతలు తెలిపారు.













