డిఎఫ్ డబ్ల్యూ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగ్ లు
డిఎఫ్ డబ్ల్యూ తెలుగు కమ్యూనిటీ వారు అమెరికాలోని టెక్సస్ రాష్ట్రము లో ఫోర్టువర్థ్ నగరం లో ఆర్ధికంగా వెనుకబడిన బడి పిల్లలకు ఉచితంగా స్కూల్ బ్యాగ్ లు, పుస్తకాలు పంపిణి చేసారు. డాంబుర్గ్ చర్చిలో జరిగిన ఈ కార్యక్రమానికి ఫోర్టువర్థ్ మేయర్ బెట్సీ ప్రస్, టెక్సాస్ స్టేట్ కాంగ్రెస్ మెన్ మార్క్ బీసీ, టెక్సాస్ స్టేట్ సెనెటర్ కొని బర్టన్ మరియు రెవరెండ్ డాచెర్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమం లో దాదాపుగా 400 మంది విద్యార్థులకు పుస్తకాలూ, బాగ్ లు పంపిణి చేయడం జరిగింది. 2007 నుంచి ప్రతి సంవత్సరం పేద విద్యార్థులకు అండగా ఉండి సహాయం చేస్తున్న నిర్వాహకులని ప్రధాన వక్తలందరూ అభినందించారు.
ఈ కార్యక్రమం లో తెలుగు ప్రముఖులు మురళి వెన్నం, శ్రీనివాసరావు కొమ్మినేని, సాంబ దొడ్డ, దినేష్ త్రిపురనేని, రాజా నల్లూరి తదితరులు పాల్గొన్నారు.













