భారత్, చైనా దేశాలకు అమెరికా హెచ్చరిక
ప్రపంచమంతా తన కనుసన్నల్లోనే నడవాలనే అమెరికా వైఖరి మరోసారి బయటపడింది. ఇరాన్‌పై విధించిన ఆంక్షల్లో భాగంగా తనకు సహకరించని దేశాలపై అత్యంత కఠిన చర్యలు తప్పవని సృష్టం చేసింది. భారత్ సహా ఏ దేశమయినా పర్యవసానాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించింది. ఇరాన్ నుంచి పెద్ద ఎత్తున చమురు దిగుమతి చేసుకుంటున్న భారత్, ఈ ఆంక్షల నుంచి తమకు మినహాయింపు ఇవ్వాలని ఇప్పటికే సృష్టం చేసినా అమెరికా వైఖరి మారలేదు. ఇరాన్‌తో కుదుర్చుకున్న అణు ఒప్పందం నుంచి బయటకొచ్చేసిన అమెరికా ఈ ఏడాది నవంబరు నుంచి ఆ దేశ చమురు రంగంపై ఆంక్షలను అమలు చేయబోతోంది.













