వచ్చేవారు ఆ వివరాలు చెప్పాలి : అమెరికా
అమెరికాకు రావాలనుకుని వీసా దరఖాస్తు చేసుకున్నవారి నుంచి సోషల్మీడియా వివరాలను కూడా తీసుకోవాలని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ఫెడరల్ రిజిస్టర్లో ఓ డాక్యుమెంట్ను పోస్టు చేసింది. సామాజిక మాధ్యమ ఖాతాల వివరాలతో పాటు పాత ఫోన్ నంబర్లు, ఈమెయిల్ ఐడీలు కూడా తీసుకోవాలనుకుంటోంది. అమెరికాకు ముప్పు కలిగించే వ్యక్తులను దేశంలో రాకుండా నిషేధించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఇంతకుముందు ఏ దేశానికైనా వెళ్లారా? ఏ దేశం వారైనా మిమ్మిల్ని బహిష్కరించారా? మీ కుటుంబంలో ఎవరికైనా ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధాలున్నాయా? తదితర ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. ఈ డాక్యుమెంట్ను అధికారికంగా నేడు పబ్లిష్ చేశారు. ఈ తాజా నిబంధనలపై తమ స్పందన తెలియజేయాలని అధికారులు ప్రజలను కోరారు. ఇందుకోసం 60 రోజుల గడువు కేటాయించారు. ప్రజల నుంచి సమ్మతి లభిస్తే నిబంధనలను వీసా దరఖాస్తు ప్రక్రియలో చేర్చనున్నట్లు తెలుస్తోంది.













