తాను అధికారంలోకి వస్తే మళ్లీ పారిస్ ఒప్పందం
నవంబరులో జరిగే ఎన్నికల్లో తాను అధికారంలోకి వస్తే వాతావరణ మార్పులపై చారిత్రక పారిస్ ఒప్పందంలో అమెరికాను తిరిగి చేరుస్తామని డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్ హామీ ఇచ్చారు. కర్బన ఉద్గారాలను తగ్గించే దిశగా కొత్త ప్రమాణాలను నిర్దేశిస్తామని చెప్పారు. దేశంలోని పశ్చిమ తీరంలో దావానలం చెలరేగుతున్న నేపథ్యంలో డెల్వార్లో ఆయన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ వాతావరణ మార్పులపై ట్రంప్ విధానాన్ని తీవ్రంగా విమర్శించారు. వాతావరణాన్ని దహించే వ్యక్తి క్ల్రైమేట్ ఆర్సనిస్ట్)గా అభివర్ణించారు. కాలిఫోర్నియా, ఓరెగాన్, వాషింగ్టన్ల్లో దావానలం చిచ్చు,. మిడ్వెస్టలో వరదలు, ఆగ్నేయ ప్రాంతంలో హారికేన్లు సంభవించడాన్ని ప్రస్తావిస్తూ కర్బన ఉద్గారాలను నియంత్రించి, గ్లోబల్ వార్మింగ్‌ను అదుపు చేయడంలో ట్రంప్ నిష్క్రియాపరత్వం వల్లనే ఇవన్నీ సంభవించాయని తీవ్రంగా విమర్శించారు.













