గుజరాత్ అప్పీల్ ను స్వీకరించిన యూఎస్ సుప్రీం
గుజరాత్ గ్రామస్తుల అప్పీల్‌ను విచారణకు స్వీకరించినట్టు యూఎస్ సుప్రీంకోర్టు పేర్కొన్నది. కేసు విచారణను అక్టోబర్‌లో చేపడతామని తెలిపింది. ప్రాసిక్యూషన్ తెలిపిన వివరాల ప్రకారం, గుజరాత్ రాష్ట్రంలో నిర్మించిన టాటా ముంద్రా పవర్ ప్లాంట్ నిర్మాణానికి యూఎస్‌కు చెందిన ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఎఫ్‌సీ) సంస్థ ఆర్థికసాయం అందజేసింది.
స్థానిక రైతులు, మత్స్యుకారులు, వ్యాపారులు పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని అడ్డుకొని తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ టాటా ముంద్రా వపర్ ప్లాంట్ తమ నిర్మాణాన్ని కొనసాగించింది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా వపర్ ప్లాంట్ నిర్మాణం జరగలేదని, ఫలితంగా గుజరాత్లో పర్యావరణ సమస్య తలెత్తిందని రైతులు నిరసన తెలిపారు. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఇమ్యూనిటీ యాక్ట్, 1945లోని నిబంధనలను టాటా ముంద్రా పవర్ ప్లాంట్ తుంగలో తొక్కిందని నినదించారు. దీనిపై న్యాయపోరాటానికి సిద్ధం అయ్యారు. కాగా, 2015లోనే గుజరాత్‌కు చెందిన పలువురు రైతులు, మత్స్యకారులు, వర్తకులు టాటా ముంద్రా పవర్‌ప్లాంట్‌పై యూఎస్ జిల్లా కోర్టులో కేసు నమోదు చేశారు.
పవర్ ప్లాంట్ నిర్మాణం కారణంగానే తమ ప్రాంతంలో పర్యావరణ సమస్యలు తలెత్తాయని పిటిషన్లో పేర్కొన్నారు. పవర్ ప్లాంట్‌కు ఫైనాన్స్ అందజేయకూడదని ఐఎఫ్సీని మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని వాపోయారు. పవర్‌ప్లాంట్ నిర్మాణానికి ఐఎఫ్‌సీ ఫైనాన్స్ ప్రతివాదిగా చేర్చాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఐఎఫ్సీఐ చర్యలు తీసుకోవాలని పిటిషన్లో అభ్యర్థించారు. అయితే, కొలంబియా జిల్లా కోర్టు ఈ కేసును కొట్టేసింది. గుజరాత్ గ్రామస్తుల వాదనలను తోసిపుచ్చింది. దీంతో వారు యూఎస్ సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు.













