ఇరాక్ లో పర్యటించిన అమెరికా విదేశాంగ మంత్రి
అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ఇరాక్‌లో పర్యటించారు. ఇరాన్ అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగిన సంగతి తెలిసిందే. అగ్రరాజ్యం బాటలోనే యూఎస్ మిత్రదేశాలు పయణిస్తున్నాయి. ఉగ్రసంస్థలకు ఇరాన్ నుంచి భారీగా విరాళాలు అందుతున్నాయని, అందుకే ఆ దేశంపై భారీగా ఆంక్షలు మోపినట్టు అమెరికా బుకాయిస్తోంది. ఇరాన్‌ను ఆర్థికంగా దెబ్బతీసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఇరాన్ నుంచి చమురు దిగుమతులను నిలిపివేసుకోకుంటే ఆంక్షలు మోపుతామంటూ ఇతర దేశాలను హెచ్చరిస్తున్నది. ఈ నేపథ్యంలో ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అగ్రరాజ్యం ఆంక్షలను భయపడకుండా ఇరాన్ తనదైన శైలీలో ఇతరదేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.













