చైనా అధికారుల వీసాలపై అమెరికా ఆంక్షలు
హాంకాంగ్ స్వయంప్రతిపత్తి వాగ్దానానికి భంగం కలిగించటంతో పాటు అక్కడి ప్రజల ప్రాథమిక, మానవ హక్కుల ఉల్లంఘనలకు చైనా పాల్పడుతోందని ఆరోపిస్తున్న అమెరికా తాజాగా వీసా ఆంక్షలను తెరపైకి తీసుకొచ్చింది. చైనా కమ్యూనిస్టు పార్టీ (సీసీపీ)కి చెందిన అధికారుల వీసాలపై ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది. అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలనే తాను అమలు చేసినట్లు అమెరికా విదేశీ వ్యవహారాల మంత్రి మైక్ పాంపియో ఈ సందర్భంగా సృష్టం చేశారు. హాంకాంగ్ పరిణామాలకు బాధ్యులుగా గుర్తించిన సీసీపీకి చెందిన ప్రస్తుత, మాజీ అధికారులు, వారి కుటుంబ సభ్యుల వీసాలకు ఈ ఆంక్షలు వర్తిస్తాయని తెలిపారు.













