F.D.A కరోనా వైరస్ పూల్ టెస్టింగ్ కి అనుమతి
అమెరికా లో పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు మరియు మరణాల దృష్ట్యా F.D.A (ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్) శనివారం 18 జూలై నా బహుళ వ్యక్తులు రక్త నమూనాల మిశ్రమ కరోనా వైరస్ పరీక్ష కి అత్యవసర ఆమోదం తెలిపింది. తగిన నలుగురు వ్యక్తుల రక్త నమూనాలను మిశ్రమం చేసి కరోనా వైరస్ పరీక్ష చైయటానికి F.D.A క్వెస్ట్ డయాగ్నోస్టిక్స్ కి అత్యవసర అధికారాన్ని ఇచ్చింది. ఈ పద్ధతిని పూల్ టెస్టింగ్ అంటారు అని F.D.A అధికారులు వెల్లడించారు. పూల్ టెస్టింగ్ పరిక్షా నివేదిక సానుకూలంగా ఉంటే, ఆ పూల్ లోని నలుగురిని కరోనా వైరస్ నెగిటివ్ గా ప్రకటించబడతారు. పూల్ టెస్టింగ్ ప్రతికూలంగా ఉంటే, ఎవరికి కరోనా వైరస్ సోకిందో తెలుసు కోవడానికి ప్రతి రక్త నమూనాను ఒక్కొక్కటిగా పరీక్షించబడుతుంది అని తెలిపారు.
కరోనా వైరస్ బాగా వ్యాప్తి చెందుతున్న సమయంలో ఈ పరిక్షా విధానం ద్వారా కరోనా వైరస్ పరీక్ష కి కావాల్సిన కీలకమైన పదార్థాలు మరియు సిబ్బంది ఉపయోగం తగ్గటమే కాకుండా , పరీక్షించగల వ్యక్తుల సంఖ్యను విస్తరిస్తుంది అని F.D.A చీఫ్, స్టీఫెన్ హాన్ తెలిపారు. 1940లో సిఫిలిస్ పరీక్ష కోసం మొట్టమొదట ఈ పరీక్ష పద్ధతిని యు.ఎస్. మిలిటరీ ఉపయోగించారు అప్పటి నుంచి చాలా దేశాలు విభిన్న పరిస్థితుల్లో పూల్ టెస్టింగ్ పద్ధతి ఉపయోగిస్తున్నారు. చైనా, జర్మనీ, ఇజ్రాయెల్ మరియు థాయ్‌లాండ్‌లో కరోనా వైరస్‌ను పరీక్షించడానికి దశాబ్దాల నాటి ఈ పద్ధతి ఉపయోగిస్తున్నారు.













