ముంబయి నిందితుడు రాణా అప్పగింతపై … అమెరికా కోర్టు స్టే
ముంబయిపై ఉగ్రదాడి కేసులో నిందితుడైన తహావ్వుర్ రాణా(62)ను భారత్కు అప్పగించడాన్ని అడ్డుకోవద్దని అమెరికా ప్రభుత్వం కోరినప్పటికీ ఒక జిల్లా కోర్టు అందుకు తిరస్కరించింది. మధ్య కాలిఫోర్నియాలోని జిల్లా కోర్టు న్యాయమూర్తి డేల్ ఫిషర్ ఈ నెల 18న రాణా అప్పగింతపై స్టే మంజూరు చేశారు. అంతకుముందు రాణా హెబియస్ కార్పస్ పిటిషన్ను జడ్జి తోసిపుచ్చారు. దీనిపై రాణా తొమ్మిదవ సర్క్యూట్ అప్పీళ్ల కోర్టుకు వెళ్లారు. సదరు అప్పీలు వ్యవహారం తేలేవరకు నిందితుడి అప్పగింతపై స్టే ఇస్తున్నట్టు జడ్జి ఫిషర్ ప్రకటించారు. అంతకుముందు అమెరికా ప్రభుత్వం నేరస్థుల అప్పగింతకు సంబంధించి భారత్తో ఒప్పందం కుదర్చుకున్న దృష్టా రాణా స్టే దరఖాస్తును నిరాకరించాలని ప్రభుత్వ న్యాయవాది జాన్ లులేజియాన్ జిల్లా జడ్జిని కోరారు. తహావ్వుర్ రాణా కెనడాలో స్థిరపడిన పాకిస్థానీ వ్యాపారి. 2008లో ముంబయిపై పాకిస్థాన్ ఉగ్రవాదుల దాడికి రాణా సహకరించాడని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఆరోపించింది.






