అమెరికాలో మరణ మృందంగం …
అమెరికాలో మరణ మృందంగం ఆగడం లేదు. కరోనా దెబ్బకు ఇంతవరకు 30,985 మంది చనిపోయినట్లు జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం ప్రకటించింది. ప్రపంచంలో ఇన్ని మరణాలు మరే దేశంలోనూ లేవని తెలిపింది. గత 24 గంటల్లోనే 2,569 మంది మృతి చెందారని వెల్లడించింది. బుధవారం సాయంత్రం నుంచి గురువారం సాయంత్రం వరకు 24 గంటల్లో ఇంత మంది చనిపోవడం రికార్డు అని తాజాగా పేర్కొంది. మొత్తంగా 6,39,664 మందికి వైరస్ సోకిందని ఏఎఫ్పీ వార్త సంస్థ తెలిపింది. వీరిలో 50,107 మంది కోలుకున్నారని పేర్కొంది. కాగా కొవిడ్ 19 వైరస్ ఆవిర్భావానికి సంబంధించి నిజానిజాలు వెల్లడించాలని అమెరికా విదేశాంగ మైక్ పాంపియో చైనాను కోరారు. ఆయన చైనా విదేశాంగ డైరెక్టర్ యాంగ్ జీచీకి ఫోన్ చేశారు.













