భారతీయ విద్యార్థులపై దాడులు. స్పందించిన వైట్ హౌస్
అమెరికాలో భారతీయ విద్యార్థులపై దాడులను శ్వేతసౌధం ఖండించింది. వీటిని అడ్డుకునేందుకు అధ్యక్షుడు జో బైడెన్ యంత్రాంగం శాయశక్తులా పనిచేస్తోందని ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇటీవల యూఎస్‌లో వివిధ ప్రాంతాల్లో నలుగురు భారతీయ అమెరికన్ విద్యార్థులు మరణించిన విషయం తెలిసిందే. జాతి, లింగం, మతం లేదా మరే ఇతర అంశాల ఆధారంగా హింసను ఉపేక్షించేది లేదు. అమెరికాలో ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. అటువంటి దాడులను అడ్డుకోవడానికి రాష్ట్ర, స్థానిక అధికారులతో కలిసి మేం చేయగలిగినదంతా చేస్తున్నాం. అధ్యక్షుడితోపాటు ఆయన యంత్రాంగం దీనిపై చాలా కష్టపడి పని చేస్తోంది అని శ్వేతసౌధం ప్రతినిధి జాన్ కిర్బీ తెలిపారు.







