చైనా వస్తువులపై అమెరికా నిషేధం!
చైనాకు చెందిన ఐదు రకాల వస్తువుల దిగుమతిపై అమెరికా నిషేధం విధించింది. కంప్యూటర్ విడి భాగాలు, దుస్తులు, పత్తి, వెంట్రుకలకు సంబంధించిన ఉత్పత్తులు సహా మరికొన్నింటిని నిషేధిత జాబితాలో చేర్చింది. ఆ ప్రాంతంలో ఉండే వీగర్లను నిర్భంద కార్మికులుగా మార్చి వీటిని ఉత్పత్తి చేస్తున్న కారణంగానే నిషేధం విధిస్తున్నట్లు తెలిపింది. మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్న చైనాకు బుద్ధి చెప్పాలంటే ఇలాంటి మార్గాల్ని అనుసరించక తప్పదని హోంలాండ్ సెక్యూరిటీ తాత్కాలిక సెక్రటరీ కెన్నెత్ అభిప్రాయపడ్డారు. చైనా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి మానవ హక్కుల ఉల్లంఘనలను అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే ఈ చర్యలు తీసుకున్నామన్నారు.













