ఆ రెండు దేశాలు సంయమనం పాటించాలి : ఐరాస
పుల్వామా ఉగ్ర దాడి తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోవడం దురదృష్టకరమని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియా గుటేరస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఉద్రిక్తతను తగ్గించడానికి ఇరుదేశాలు వెంటనే కృషి చేయాలని, సంయమనం పాటించాలని సూచించారు. ఇరుదేశాల మధ్య శాంతియుత వాతావరణం నెలకొనడానికి జోక్యం చేసుకోవాలని ఇరువురు కోరితే తాము సిద్దమేనని తెలిపారు. భారత బలగాలపై దాడి జరిగి 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని, ఈ ఘటనను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు.













