జూన్ 4 నుంచి జూలై 16వరకు కెనడా, యుఎస్‌ఎలో శ్రీనివాస కళ్యాణాలు

ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారి మార్గదర్శకత్వంలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రవాస తెలుగు సంఘం (ఎపిఎన్‌ఆర్‌టీ), కెనడా మరియు యుఎస్‌ఎ లోని పలు తెలుగు అసోసియేషన్లు మరియు ధార్మిక సేవా సంస్థల నుండి వచ్చిన అభ్యర్ధనల మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కెనడా యుఎస్ నగరాల్లో శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవాలను నిర్వహిస్తున్నది. మొత్తం 12 నగరాలలో 4 జూన్ 2023 నుండి 16 జూలై 2023 వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి వారి కళ్యాణోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఆయా సంస్థల కార్యనిర్వాహక వర్గంతో పాటు పలు తెలుగు, భారతీయ ధార్మిక మరియు సేవా సంస్థలతో సమన్వయము చేసుకుని నిర్వహిస్తోంది. తిరుమల నుండి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారి మూర్తులను కెనడా, యూఎస్‌ఎ లకు తీసుకురానున్నారు. తిరుమల శ్రీవారి దేవస్థానం నుండి వచ్చే అర్చకులు. వేద పండితులు వైఖానస ఆగమం ప్రకారం శ్రీనివాస కళ్యాణాన్ని నిర్వహించి స్వయంగా తిరుమల నుండి తెప్పించిన అడ్డూ ప్రసాదాన్ని భక్తులకు అందజేస్తారు. ఈ కల్యాణోత్సవాల్లో తిరుమల తిరుపతి దేవస్థానముల చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి గారి దంపతులు పాల్గొంటారు.
ఇతర వివరాలకు బ్రోచర్ చూడండి.