TTA: టీటీఏ పోర్ట్‌ల్యాండ్ ఛాప్టర్ ఆధ్వర్యంలో ఉత్సాహభరితంగా మహిళా దినోత్సవ వేడుకలు
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) పోర్ట్‌ల్యాండ్ చాప్టర్ ఆధ్వర్యంలో మహిళల శక్తిని, విజయాలను గౌరవిస్తూ నిర్వహించిన మహిళా దినోత్సవ (Women’s Day) వేడుకలు ఉత్సాహభరితంగా జరిగాయి. ఈ సందర్భంగా టీటీఏ (TTA) వ్యవస్థాపకులు డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి, టీటీఏ అధ్యక్షులు నవీన్ రెడ్డి మల్లెపెద్ది, మొత్తం ఏసీ, ఈసీ, బీవోడీ సభ్యులకు పోర్ట్‌ల్యాండ్ ఛాప్టర్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి మద్దతు అందించినందుకు, తమను ముందుంది నడిపించినందుకు ధన్యవాదాలు తెలిపింది. ఈ (Women’s Day) కార్యక్రమం ఘన విజయం సాధించడానికి ఎంతో కృషి చేసిన మయూర్ రెడ్డి బండారు(బోర్డ్ ఆఫ్ డైరెక్టర్), పోర్ట్‌ల్యాండ్ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసింది. ఈ కార్యక్రమానికి హాజరైన అతిథులు, అంకితభావంతో పనిచేసిన నిర్వాహకులు, ఉత్సాహంగా పాల్గొన్న ఔత్సాహికులు, దాతృత్వం చూపించిన స్పాన్సర్లు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసింది.







