TTA: టీటీఏ ఆధ్వర్యంలో విజయవంతంగా మహిళా దినోత్సవ వేడుకలు
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టీటీఏ) (TTA) ఫీనిక్స్ ఛాప్టర్ విజయవంతంగా మహిళా దినోత్సవ వేడుకలు జరపుకుంది. మార్చి 15న జరిగిన ఈ వేడుకల్లో సంప్రదాయబద్ధమైన వనభోజనాలను కూడా ఏర్పాటు చేయడం గమనార్హం. టీటీఏ (TTA) ప్రెసిడెంట్ నవీన్ రెడ్డి మల్లిపెద్ది గారి నేతృత్వంలో ఇంటర్నేషనల్ సర్వీస్ డైరెక్టర్ జ్యోతిరెడ్డి దూదిపాల, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ప్వీన్ సామల ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. వీరితోపాటు ఆర్వీపీలు, ఫీనిక్స్ కోర్ టీం చేసిన అమోఘమైన కృషితో.. స్థానిక కమ్యూనిటీ అంతా అద్భుతమైన స్ఫూర్తితో ఈ కార్యక్రమం కోసం ఏకమైంది.







