TTA: డిసెంబర్ 8 నుంచి 22 వరకు టిటిఎ సేవా డేస్ కార్యక్రమాలు
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) హైదరాబాద్ లో టిటిఎ సేవా డేస్ కార్యక్రమాలను వైభవంగా జరిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. డిసెంబర్ 8 నుంచి 22వ తేదీ వరకు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వికలాంగులకు కృతిమపరికరాల పంపిణీ, మహిళల ఆరోగ్యం, క్యాన్సర్ పై అవగాహన సదస్సు, కమ్యూనిటీకోసం ఆరోగ్య శిబిరాలు, విద్యార్థుల చదువుకు సహాయం, ప్రభుత్వ స్కూళ్ళకు అవసరమైన సహాయం, గ్రామాల అభివృద్ధికి చేయూత వంటి సేవలతోపాటు యూత్ ఎంపవర్మెంట్ తదితర కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ వేడుకల నిర్వహణకోసం కమిటీని కూడా టిటిఎ నాయకులు ఏర్పాటు చేశారు.
అధ్యక్షుడు నవీన్ రెడ్డి మలిపెద్ది, సేవాడేస్ కో ఆర్డినేటర్ విశ్వకంది, టిటిఎ 10వ వార్షికోత్సవ వేడుకల కమిటీ చైర్ డా. నరసింహారెడ్డి దొంతిరెడ్డి, సేవాడేస్ కో కోఆర్డినేటర్ ప్రవీణ్ చింత, ఇండియా సేవాడేస్ కో ఆర్డినేటర్ మధుకర్ రెడ్డి బీరం, మీడియా అండ్ కమ్యూనికేషన్స్ చైర్ దీపికారెడ్డి నల్ల ఈ కమిటీలో ఉన్నారు. సేవా డేస్ అడ్వయిజర్లుగా డాక్టర్ ద్వారకనాథ్ రెడ్డి, సురేష్ వెంకన్నగరి, గణేష్ మాధవ్ వీరమనేని, నరసింహ పెరుక ఉన్నారు. టిటిఎ అడ్వయిజరీ కమిటీ నాయకులు వ్యవస్థాపకులు డాక్టర్ పైళ్ళ మల్లారెడ్డి, చైర్ డాక్టర్ విజయపాల్ రెడ్డి, కో చైర్ డా. మోహన్ రెడ్డి పాటలోళ్ళ, సభ్యులు భరత్ రెడ్డి మందాడి, శ్రీని అనుగుతోపాటు ఇసి కమిటీ నాయకుల పర్యవేక్షణలో ఈ వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నారు.






