TTA: లాస్ ఏంజెల్స్ లో ఘనంగా టిటిఎ బతుకమ్మ వేడుకలు

తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) ఆధ్వర్యంలో లాస్ ఏంజిల్స్ చాప్టర్ ఆధ్వర్యంలో బతుకమ్మ 2025 వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రవాసులను ఏకం చేసే ఈ అద్భుతమైన వేదికను స్థాపించినందుకు, టిటిఎ వ్యవస్థాపకులు డా. పైళ్ళ మల్లారెడ్డికి, అధ్యక్షుడు నవీన్ రెడ్డి మల్లిపెద్ది, గత అధ్యక్షుడు వంశీ రెడ్డి కంచరకుంట్లతోపాటు టిటిఎ ఉన్నత నాయకులకు ముందుగా నిర్వాహకులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే అనిల్ ఎర్రబెల్లి, సంతోష్ గంటారం, ప్రదీప్ బొడ్డు, హరీందర్ తల్లాపల్లి, సుజిత్ వాడి మరియు శ్రీనివాస్ గజింగ్, రాము డోనికాన మరియు రాజా రెడ్డి పార్థిరెడ్డి, రమేష్ మోటె, రవీందర్ దేశెట్టి, సుమిత్ రెడ్డి డీ రెడ్డి మరియు సాయి మహేష్ జులూరు తదితరులకు కూడా నిర్వాహకులు ధన్యవాదాలు తెలియజేశారు.
జ్యోతి ప్రజ్వలన మరియు భక్తి గీతాలతో వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత శ్రీ విద్యా గణపతి దేవాలయం నుండి వచ్చిన పూజారి ప్రసాద్ గారు నేతృత్వంలో దుర్గా అమ్మవారి పూజ జరిగింది. అట్లాంటాకు చెందిన డా. వాణి గడ్డం ఈ కార్యక్రమాన్ని తమ హుందాతనం మరియు వాక్చాతుర్యంతో నిర్వహించి, ఈ చిరస్మరణీయ సాయంత్రానికి సరైన వాతావరణాన్ని సృష్టించింది. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా డేవిడ్ న్యూమాన్ (థౌజండ్ ఓక్స్ మేయర్), కుల్వంత్ సింగ్ (ఇండియన్ కాన్సులేట్ నుండి కాన్సుల్) హాజరయ్యారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ఉదారంగా మద్దతు ఇచ్చిన మా ప్రాయోజకులకు (స్పాన్సర్‌లకు) వారు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈవెంట్ స్పాన్సర్‌లుగా వెస్ట్ క్లిఫ్ రియాల్టీ, సంతోష్ & స్వాతి గంటారం, డైమండ్ స్పాన్సర్‌లు: రియాన్ కన్‌స్ట్రక్షన్స్ (నళిన్-శ్రీదేవి పిచునూరి), క్లౌడిఫై టెక్నాలజీస్ (అనిల్-ప్రమత అరబెల్లి), లిమ్సన్స్ ఐటి సర్వీసెస్ ఎల్‌ఎల్‌సి (ప్రదీప్ నీరజ బొడ్డు), సుజిత్ వాడి -టీమ్, ప్లాటినం స్పాన్సర్: రజనీకాంత్ – సుష్మ, గోల్డ్ స్పాన్సర్‌లుగా శ్రీనివాస్ అరుంధతి గజింగ్, వాసు-ప్రసన్న వావిళ్ళ, సంగ్రామ్ – ప్రీతి రెడ్డి, రాము-ఉమ డోనికానతోపాటు ఫుడ్ స్పాన్సర్‌లుగా నిజామి బిర్యానీ, ప్యారడైజ్ బిర్యానీ, బిర్యానీ టెంప్టేషన్స్ ఉన్నారు. అలంకరణ-వినోదం: ఈవెంట్స్, ఆర్,డిజె (రిత్విక్ ఆదిచెర్ల), అండర్ ది లెన్స్ ఫోటోగ్రఫీ (రాజ్ పాగిడిపాటి)కి, ఆటా, టిఎఎస్ సి, టిడిఎఫ్, లాటా సంఘాలకు, ఇతర కమ్యూనిటీ భాగస్వాములు అందరికీ వారి క్రియాశీల భాగస్వామ్యానికి మరియు నిరంతర ప్రోత్సాహానికి నిర్వాహకులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
రంగురంగుల పువ్వులు, భక్తి పాటలు, ఉల్లాసభరితమైన నృత్యాలు మరియు సామూహిక భోజనాలతో, బతుకమ్మ 2025 మరచిపోలేని విధంగా సాగింది. ఆనందోత్సాహభరిత వాతావరణం దక్షిణ కాలిఫోర్నియాలోని తెలుగు కమ్యూనిటీ యొక్క గాఢమైన సాంస్కృతిక మూలాలను మరియు సన్నిహిత బంధాలను వెల్లడించింది.