వైట్ హౌస్ నుండి సంచలన ప్రకటన
జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించే కార్యనిర్వాహక ఉత్తర్వులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేయనున్నట్లు వైట్‌హౌస్ మీడియా కార్యదర్శి సారా శాండర్స్ వెల్లడించారు. అమెరికా-మెక్సికో సరిహద్దులో గోడ నిర్మించేందుకు ట్రంప్ యత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నిర్మాణానికి 5.6 బిలియన్ డాలర్లు వినియోగించనున్నారు. అయితే ట్రంప్ ప్రభుత్వ నిధుల బిల్లుపై సంతకం చేయనున్నారని ఆమె తెలిపారు. అలాగే జాతీయ భద్రతను పెంచేందుకు, సరిహద్దు వద్ద సంక్షోభాన్ని అరికట్టేందుకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని శాండర్స్ తెలిపారు. కాగా, సెనెట్ మెజారీటీ నేత మెక్ కన్నెల్ ఈ చర్యను బహిరంగం చేసిన అనంతరం వైట్ హౌస్ నుండి ప్రకటన వెలువడడం గమనార్హం.













