ఎఫ్ బీఐ తీరుపై ట్రంప్ అసహనం
ఫ్లోరిడా స్కూలు కాల్పులు ఘటనలి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎఫ్బిఐ పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఈ కేసులో చాలా సంకెతాలు అందినా ఎఫ్బిఐ వాటిని పట్టించుకోలేదన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ స్పందించారు. వారి పనితీరు సమంజసంగా లేదన్నారు. వారు సమయమంతా ఎన్నికల ప్రచారంలో రష్యా పాత్రపై దృష్టి కేంద్రీకరించేందుకే వినియోగిస్తున్నారన్నారు. అయితే వారి ఆలోచిస్తున్నట్టుగా ఏ కుట్ర లేదన్నారు. ఇప్పటికైనా వారు తమ పనితీరుతో పూర్వవైభవాన్ని సాధించాలన్నారు. ఇదిలా ఉండగా ఎఫ్బిఐ గతనెలలో ఫ్లోరిడా స్కూలు కాల్పుల కేసులో నిందితుడు ఈ దురాగతానికి పాల్పడబోతున్నట్లు ముందుగానే సమాచారం అందించినా వారు ఖాతరు చేయలేదు. ఎఫ్బిఐ అధికారులు ఈ సందర్బంగా మాట్లాడుతూ ఏజెన్సీ అధికారులు సరైనవిధంగా దర్యాప్తు చేయటంలో విఫలమయ్యారని తెలిపారు. ఫ్లోరిడా గవర్నర్ రిక్ స్కాట్ ఎఫ్బిఐ డైరెక్టర్ క్రిస్టోఫర్ రేను పిలిచి రిజైన్ చేయవలసిందిగా కోరారు. ఇదిలా ఉండగా ఎఫ్బిఐకి ప్రధాన విమర్శకుడిగా అధ్యక్షుడు ట్రంప్ వ్యవహరిస్తున్నాడని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.













