లైంగిక దాడుల ఆరోపణలను తోసిపుచ్చిన డొనాల్డ్ ట్రంప్
1990లో న్యూయార్క్‌లోని డిపార్ట్మెంట్ స్టోర్ డ్రస్సింగ్ రూంలో తనపై ట్రంప్ లైంగిక దాడి చేసినట్లు ఒక పత్రిక కాలమిస్ట్ చేసిన ఆరోపణలను అమెరికా అధ్యక్షుడు తోసిపుచ్చారు. ఒక మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ తనపై ఆరోపణలు చేస్తున్న వ్యక్తి నా లాంటిది కాదన్నారు. తనపై ఆరోపణలు చేస్తున్న వ్యక్తి పట్ట తనకు అపారమైన గౌరవం వుందని, లైంగిక దాడి అనేది ఎన్నడూ జరగలేదని ట్రంప్ చెప్పారు. తనను ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి ఈ లైంగిక దాడి ఆరోపణలను ప్రాస్తావించినపుడు అని పూర్తిగా అసత్యం అని తోసిపుచ్చారు. తనపై ఆరోపణలు చేస్తున్న మహిళ గురించి తనకు ఏమీ తెలియదని ట్రంప్ చెప్పారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నిక కాక ముందు ఆయన అసభ్యంగా ప్రవర్తించిన మహిళల్లో తాను 16వ వ్యక్తినని కాలమిస్ట్ ఇ.జీన్ కరోల్ తెలిపారు.













