గొలుసు వలసలకు ముగింపు పలకాల్సిందే
దేశంలోకి ప్రతిభ ఆధారితంగానే వలసలు ఉండాలని గత వారమే ప్రతిపాదించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్, గొలుసు వలసలకు ముగింపు పలకాల్సిందేనని అన్నారు. నూతన వలస విధానం విదేశీయులకు కాకుండా అమెరికన్లకు ఉద్యోగాల్లో అధిక ప్రాధాన్యం లభించేలా ఉండాలని తన కేబినెట్ సహచరులతో శ్వేతసౌధంలో నిర్వహించిన సమావేశంలో తెలిపారు. గత వారం కాంగ్రెస్ (ఉభయ చట్టసభలు)కు పంపిన ప్రతిపాదనల్లో ఈ విషయాన్ని సృష్టంగా పేర్కొన్నట్లు వెల్లడించారు. అక్రమ వలసలు, వీసా గడువు దాటినా విదేశీయులు దేశంలోనే ఉండిపోవటం వంటి లోపాలకు అంతం పలకాలని సృష్టం చేశానన్నారు.













