చైనాపై అమెరికా ఆంక్షలు
మైనారిటీ తెగలపై చైనా దాష్టీకాలకు పాల్పడుతోందంటూ ఆ దేశంపై కఠిన ఆంక్షలను విధించేందుకు ఉద్దేశించిన బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. పశ్చిమ చైనాలో జిన్జియాంగ్ ప్రాంతంలో వియ్ఘర్ ముస్లింలపై సామూహిక నిఘా, నిర్బంధాలకు పాల్పడుతున్న చైనా అధికారులపై కఠిన ఆంక్షలను ఉద్దేశించిన ఈ ద్వైపాక్షిక బిల్లును సెనేట్ ఇప్పటికే ఆమోదించింది. తాజా ఆంక్షల బిల్లుకు ఇక అధ్యక్షుడి ఆమోదమే తరువాయి. చరిత్రలోనే తొలిసారిగా ప్రాక్సీ ఓట్స్ విధానంలో ఆమోదం పొంందిన బిల్లు ఇది. మరోవైపు శ్వేతసౌధంలో నిర్వహించిన మీడియా సమావేశంలో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ ఈ వారంలోనే చైనాపై కఠిన చర్యలు ఉంటాయని వెల్లడించారు.













