డొనాల్డ్ ట్రంప్ మరో షాక్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో షాక్ ఇవ్వనున్నారు. జాతీయ భద్రతా సలహాదారు హెచ్ఆర్ మెక్‌మాస్టర్‌ను తప్పించే ఆలోచనలో ట్రంప్ ఉన్నట్లు కథనాలు వస్తున్నాయి. ఇప్పటికే ట్రంప్ టీమ్ నుంచే అనేక మంది ఉన్నత స్థాయి పదవులను వదిలేసి వెళ్లారు. అయితే మెక్‌మాస్టర్ ఎప్పుడు తన పదవికి రాజీనామా చేస్తారన్న విషయం ఇంకా సృష్టంగా తెలియదు. గత మంగళవారమే మంత్రి రెక్స్ టిల్లర్సన్ను తొలిగిస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. సెక్యూర్టీ అడ్వైజర్ మెక్మమాస్టర్ మరీ టఫ్‌గా ఉన్నారని, ఆయన ఇచ్చే బ్రీఫింగ్స్ మరి ఎక్కువ సమయం తీసుకుంటున్నాయని ట్రంప్ అసహనంతో ఉన్నారు. త్రీ స్టార్ ఆర్మీ జనరల్ మెక్‌మాస్టర్ పనితీరు తనకు నచ్చడం లేదని ట్రంప్ వెల్లడించినట్లు సమాచారం.













