ఆ ఉత్తర్వుతో 7,000 భారతీయ-అమెరికన్ యువకులకు ఊరట
జూలై 17 న మేరీల్యాండ్‌లోని ఒక ఫెడరల్ కోర్టు డిఫరెంట్ ఆక్షన్ ఫర్ చైల్డ్ ఎరైవల్స్ (DACA) పోగ్రాం పూర్తిగా పునరుద్ధరించాలని తీర్పు ఇచ్చింది, అంటే ఇది మూడేళ్ళకి మొదటిసారి కొత్త దరఖాస్తుదారులు తెరవాలి అని స్పష్టం చేసింది. ఈ పోగ్రాం యు.ఎస్. కు పిల్లలుగా వచ్చిన వలసదారులను చట్టబద్దమైన హోదా లో పని చేసుకోవటానికి అనుమతితో పాటు, బహిష్కరణ నుండి రక్షిస్తుంది. ఈ తీర్పుతో సుమారు 7,000 మంది భారతీయ-అమెరికన్ యువకులు ఈ పోగ్రాం కింద రక్షణ పొందుతారు, వారు బహిష్కరణకు భయపడకుండా అమెరికా లో ఉండటానికి మరియు పని చేయడానికి కూడా వీలు కల్పిస్తుంది అని ఇండియా-వెస్ట్ తెలిపింది. సుమారు 650,000 మంది ప్రజలు ఇందులో రిజిస్టర్ అయి ఉన్నారు గత నెలలో, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2017 లో DACA పోగ్రాం సరిగ్గా ముగించలేదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ట్రంప్ పరిపాలన కొత్త దరఖాస్తులను అంగీకరించడం ప్రారంభించాల్సి ఉందని, ట్రంప్ ఈ కార్యక్రమాన్ని ఎప్పుడైనా ముగించవచ్చు అని ఇమ్మిగ్రేషన్ న్యాయవాదులు వాదించినా ఫలితం లేకపోయిందని అధికారులు చెప్పారు. పక్షపాతరహిత అయిన థింక్ ట్యాంక్ మైగ్రేషన్ పాలసీ ఇన్స్టిట్యూట్ అంచనా ప్రకారం, అదనంగా 66,000 మంది యువ వలసదారులు 15 సంవత్సరాల దాటడంతో ఇప్పుడు ఈ పోగ్రాం కి అర్హత సంపాదించారు అని ఇండియా-వెస్ట్ తెలిపింది.













