షట్డౌన్ తో తీవ్ర పర్యవసానాలు : ట్రంప్

కరోనా వైరస్ క్టడికి దేశమంతా షట్డౌన్ ప్రకటించాలన్న వైద్యుల సూచనను అమలు చేయడానికి వ్యతిరేకం అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన పర్యవసానాలను ఎదుర్కొంటుందన్నారు. ప్రపంచం మొత్తం ఏండ్లుగా లాక్డౌన్ ప్రకటించినా తాము ఆ పని చేయమన్నారు. కరోనా నివారణలో కీలకలంగా భావిస్తున్న క్లోరోక్వీన్ ఔషధ నిల్వలను సేకరించడంపై దృష్టిని కేంద్రీకరించామన్నారు. ఆసియా అమెరికన్లను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ట్రంప్ చెప్పారు. ఇంతకుముందు కరోనా వైరస్ను చైనీస్ వైరస్ అని ట్రంప్ పేర్కొన్న తర్వాత ఆసియా దేశాలకు చెందిన అమెరికన్లపై దాడుల నేపథ్యంలో ఇలా స్పందించారు.











































































