ట్రంప్ పై ఒబామా ఆరోపణలు

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ కనీస ప్రజాస్వామ్య విలువల్ని పాటించటం లేదని, చట్టాన్ని, పత్రికా స్వేచ్ఛకు ప్రమాదకరంగా మారారని మాజీ అధ్యక్షుడు ఒరాక్ బబామా విమర్శించారు. ప్రతినిధుల సభకు మధ్యంతర ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను మాట్లాడిన వీడియో ప్రసంగాన్ని మీడియాకు విడుదల చేశారు. క్రిమినల్ నేర విచారణ వ్యవస్థనూ చూపుతూ, తన రాజకీయ ప్రత్యర్థుల్ని (హిల్లరీ క్లింటన్) ట్రంప్ బెదిరిస్తున్నారని ఒబామా ఆరోపించారు. దీనిని అడ్డుకోవాలంటే, అమెరికా ప్రజాస్వామ్య విలువలు, ఆలోచనలకు కట్టుబడి ఉండే వ్యక్తుల్ని శ్వేతసౌధం అధికారులుగా నియమించాల్సిన అవసరముందన్నారు. అంతేగాక పారదర్శకమైన పాలన అందించటంలో ట్రంఫ్ విఫలమయ్యారని విమర్శించారు. ట్రంప్ ఎంచుకున్న విధానాలు చాలా లోపభూయిష్టంగా ఉన్నాయని అన్నారు. తాను అధ్యక్షుడిగా 2015లో తీసుకున్న విధాన నిర్ణయాల కారణంగానే నేడు దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందని చెప్పుకొస్తున్నారు. రిపబ్లికన్ పార్టీ వివాదాస్పద సిద్ధాంతాలతో వాతావరణ ఒప్పందాల్ని, పౌరుల హక్కుల్ని కాలరాస్తోందని ఆరోపిస్తున్నారు.











































































