హనోయ్ లో ట్రంప్-కిమ్ భేటీ
కొరియా ద్వీపకల్పాన్ని అణ్వస్త్ర రహితంగా మార్చే దిశగా మరో ముందడుగు పడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌లు రెండోసారి భేటీ అయ్యారు. వియత్నాంలోని హనోయ్ నగరంలో ఉన్న సోఫీటెల్ లెజెండ్ మెట్రోపాల్ హోటల్లో ఈ నేతలిద్దరూ మీడియా సమక్షంలో కరచాలనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఉత్తరకొరియా అధినేత కిమ్ మీడియాతో మాట్లాడుతూ ఈసారి సదస్సులో గొప్ప ఫలితాన్ని సాధిస్తామని ఆశాభావంతో ఉన్నాను. దీన్ని ప్రతీఒక్కరూ తప్పకుండా స్వాగతిస్తారు అని తెలిపారు. అనంతరం ట్రంప్ స్పందిస్తూ.. గతంలో జరిగిన చర్చలతో పొల్చుకుంటే ఈ భేటీలో మెరుగైన ఫలితాలను సాధిస్తాం అని అభిప్రాయపడ్డారు.
సింగపూర్‌లోని క్యాపెల్లా హోటల్లో 2018, జూన్ 12న ట్రంప్- కిమ్ తొలిసారి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉత్తర కొరియా పూర్తిస్థాయిలో అణ్వాయుధాలను త్వజించాలని ట్రంప్ కోరారు. అయితే అణు పరీక్షలు, ఖండాంతర క్షిపణి ప్రయోగాలను నిలిపివేసేందుకు కిమ్ ప్రభుత్వం అంగీకరించింది.













